అగ్ని ప్రమాద బాధిత రైతుకు సాయి భక్త మండలి చేయూత

On: April 23, 2026 8:28 PM

అగ్ని ప్రమాద బాధిత రైతుకు సాయి భక్త మండలి చేయూత

అగ్ని ప్రమాద బాధిత రైతుకు సాయి భక్త మండలి చేయూత

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన రైతు బట్టా నవీన్ మిర్చి పంట అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోవడంతో, షిరిడి సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. దాతల సహకారంతో రూ.77 వేల చెక్కును స్థానిక సర్పంచ్ తాటి సరస్వతి, తహసీల్దార్ మేడ వేణుగోపాల్ చేతుల మీదుగా రైతుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ధనపనేని వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా నాయకుడు తోట మల్లికార్జునరావు పాల్గొన్నారు. అనంతరం సాయి బాబా ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుకు సహాయం చేసిన దాతలుగా సీఐ ముత్యం రమేష్, ఎస్‌ఐ కొప్పుల తిరుపతి, గొడవర్తి నరసింహమూర్తి, గంప రాంబాబు, బాలసాని వేణుగోపాల్, అశ్వపతి, రవిశంకర్, మన్యం సునీల్ బాబు, కలకోట సంతోష్ కుమార్, బాచినేని ప్రవీణ్, శ్రీనాథ్ ఆగ్రోస్, సయ్యద్ హుస్సేన్, కొమ్మనాపల్లి వెంకటేశ్వర్లు, చిట్టెం ఠాకయ్య, బట్టా శ్రీను (రాజ్ టీవీ), గడ్డం రామకృష్ణ, రామెల్ల రాజశేఖర్ తదితరులు ఉండగా, వీరిని పలువురు అభినందించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!