సమ్మె మధ్య సంచలనం – డిపో వద్ద డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

On: April 23, 2026 4:07 PM

సమ్మె మధ్య సంచలనం – డిపో వద్ద డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

సమ్మె మధ్య సంచలనం – డిపో వద్ద డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నర్సంపేట, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారి కలకలం రేపింది. అధికారుల వైఖరికి నిరసనగా ఒక డ్రైవర్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడంతో విషాద ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది మంటలను ఆర్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. అధికారుల వేధింపులు, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!