కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం

On: April 22, 2026 7:57 PM

కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం

కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు యూ-టర్న్ పరిష్కారం

రాంగ్ రూట్, రద్దీ సమస్యల నివారణకు చర్యలు

సంయుక్తంగా అధికారుల నిర్ణయం

ములుగు, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంతంలో నిత్యం అధిక వాహన రద్దీ కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా డివైడర్ వద్ద యూ-టర్న్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కోర్టు అవసరాల కోసం రోజువారీగా పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనాలతో రావడం, యూ-టర్న్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారి బారాగాడి శ్రీనివాస్ జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ యూ-టర్న్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఈ ప్రతిపాదనపై ఆర్&బీ, నేషనల్ హైవే, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అమలుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రమాదాలు నివారించబడతాయని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!