ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి

On: April 23, 2026 2:37 PM

ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి

ఏటూరునాగారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి

ఏటూరునాగారం, ఏప్రిల్ 23, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండల యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి (ఠాగూర్) ను నియమించారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ.ఎస్‌.ఆర్ ఖాన్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు మరియు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!