టూ వీలర్ ఢీకొని బాలికకు గాయాలు
కన్నాయిగూడెం, ఏప్రిల్ 23,తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టూ వీలర్ ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయి స్పృహ కోల్పోయింది. ఈ ప్రమాదంలో బాలికకు ముఖం, తలకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.









