భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం

On: April 22, 2026 8:58 PM

భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం

భోదాపురం శివారులో క్షుద్ర పూజలు.. గ్రామస్తుల్లో భయం…

రోడ్డు పక్కన పూజల ఆనవాళ్లు.. గుప్తనిధుల అనుమానం

వెంకటాపురం నూగూరు ఏప్రిల్ 22 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురం గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామ పంచాయతీ కేంద్రానికి సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే బుధవారం ఉదయం పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, నిమ్మకాయలు, బొమ్మలు సహా పూజా సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుప్తనిధుల కోసం కొంతమంది ఈ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గ్రామంలో చర్చలు సాగుతున్నాయి. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!