క్రిందపడిన కేబుల్ లైన్‌తో ప్రమాద భయం

On: April 24, 2026 12:05 PM

క్రిందపడిన కేబుల్ లైన్‌తో ప్రమాద భయం

క్రిందపడిన కేబుల్ లైన్‌తో ప్రమాద భయం

కన్నాయిగూడెం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం నుంచి కన్నాయిగూడెం వరకు వెళ్లే డిష్ కేబుల్ లైన్ గత రెండు రోజులుగా కరెంటు పోల్స్‌పై నుంచి క్రిందపడిపోయి ఉండటంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చింతగూడెం గ్రామ పరిధిలో రహదారిపై కేబుల్ లైన్ పడి పోవడంతో ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పశువులు సంచరిస్తున్న సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కేబుల్ నిర్వాహకులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!