వాజేడు మండలంలో ఎన్ హెచ్ పై విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలంలో శనివారం ప్రధాన జాతీయ రహదారిపై వాజేడు , పేరూరు పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా వాహనాల తణికీలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి .రమేష్ ఆధ్వర్యంలో కడేకల్ గ్రామం వద్ద వచ్చే పోయే వాహనాలను శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. అలాగే మండలంలోని వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాక ఎన్హెచ్ పై వాజేడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాల తణీకీల కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ప్రతి వాహనదారుడు వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, పరిమితంగా ప్రయాణికులు ను ఎక్కించు కోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఇంకా అనేక రోడ్డు భద్రత పరమ్మన అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాజేడు మండలంలో జాతీయ రహదారిపై వేరు,వేరుగా జరిగిన వాహనాల తనిఖీల కార్యక్రమంలో, వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు ,పేరూరు ఎస్సై రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ సివిల్ పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు వాహనాల తనిఖీల కార్యక్రమం లో పాల్గొన్నారు.