వైభవంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ..
– ములుగు శివాలయంలో ఆడిపాడిన మహిళలు
ములుగు ప్రతినిధి : ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున మహిళలు సందడి చేశారు. ములుగులోని శివాలయం వద్ద బతుకమ్మలతో తరలివచ్చి బతుకమ్మ పాటలు పాడారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిన్నారులు, మహిళలతో సందడి నెలకొంది. ఉయ్యాల, బతుకమ్మ పాటలు, డీజే పాటలతో ములుగులో బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ములుగులోని రామాలయం వద్ద దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు.