అప్పులు బాధ తాళలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పెద గొల్లగూడెం గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పని చేస్తున్న చాప బుచ్చయ్య (55) అప్పులు బాధ తాళలేక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ కదనం ప్రకారం.. బుచ్చయ్య ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారని, అప్పులు బాథ తాళ లేక, కోయ వీరాపురం గ్రామ సమీపం లోనీ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సమా చారం తెలుసుకున్న బంధువులు ఏటూరునాగారం తరలిం చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతుడు బుచ్చయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు ఎస్సై ఆర్. హరీష్ మీడియాకు తెలిపారు. విది నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే సీనియర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుచ్చయ్య మృతి పట్ల ఏటిఎఫ్ తో సహా పలు ఉపాధ్యాయ సంఘాలు,గిరిజన సంఘాలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. అందరితో కలిసి మెలిసి ఆప్యాయంగా పలకరించే బుచ్చయ్య సార్ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే, బుచ్చయ్య సారు మృతి తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.