మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న అంబేద్కర్ యువజన సంఘం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మంగపేట మండ లంలోని అంబేద్కర్ యువజన సంఘం మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసున్నదని మాదిగ సామాజికవర్గం ఆరోపిం చారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఎంపెళ్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహా శిలాఫలకంలో, కరపత్రాలలో మాదిగ సామాజిక వర్గా నికి సంబంధించిన సీనియర్ నాయకుల పేర్లు, గ్రామ కమిటీల అధ్యక్షుల పేర్లు పెట్టకుండా, డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే పెట్టి అవమానిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం అంటే మాల సామాజిక వర్గం, నేతకాని సామాజిక వర్గాలే ఉన్నాయా అని ఏంపెళ్లి మల్లేష్ మాదిగ ప్రశ్నించారు. మండలంలో దళితుల మధ్య చిచ్చులు పెడు తూ మాల, మాదిగ, అని బేధాలు తెస్తున్నది అంబేద్కర్ యువజన సంఘంలో ఉన్న సీనియర్ నాయకులే అని ఆరో పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మాదిగ సామాజిక వర్గం తరుపున అంబేద్కర్ వివరహాన్ని పెట్టనున్నట్లు తెలిపారు. మండలంలో మాదిగలు ఆదివాసీలతో అనేక ఏండ్లుగా కలిసిమెలిసి ఉంటున్నామని మేము అధివాసీలకు అన్ని విషయాలలో పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరికి శ్రీనివాస్ మాదిగ, ఎల్పీ రవి మాదిగ, ఎంపెళ్లి చందర్రావు మాదిగ, గుగ్గిళ్ల సురేష్ మాదిగ, యాసం హరీష్ మాదిగ, ఈసంపెళ్లి సురేందర్ మాదిగ, గుగ్గిళ్ల నరసింహారావు మాదిగ, గాజర్ల రాజు మాదిగ, కదురు మల్లేష్ మాదిగ, వంకాయల వెంకటేష్ మాదిగ, పాలమాకుల సోమనర్సయ్య మాదిగ, గాజర్ల శ్రీను మాదిగ, ఎంపెళ్లి సారయ్య మాదిగ, ఎల్పీ రాజు మాదిగ, చిట్యాల రాజశేఖర్ మాదిగ, ఎల్పీ పెద్ద శ్రీను మాదిగ, ఎల్పీ చిన్న శ్రీను మాదిగ తదితరులు పాల్గొన్నారు.