అక్రిడిటేషన్ కమిటీలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి
ములుగు ప్రతినిధి : అక్రిడిటేషన్ కమిటీలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరుతూ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భానోత్ వెంకన్న ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ జిల్లా అక్రిడేషన్ కమిటీలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియే షన్ సభ్యులకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వం డిసెంబర్ నెలలో గిరిజన జర్నలిస్టులకు నిర్వహించబోతున్న శిక్షణ తర గతులలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అవకాశం కల్పించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో గౌరవ అధ్యక్షులు భూక్య సునీల్,కార్యదర్శి ముకులోత్ శరత్,వర్కింగ్ ప్రెసిడెంట్ నేతావత్ సుధాకర్,ఉపాధ్యక్షుడు పోరికసునీల్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.