కలెక్టర్ ను కలిసిన టి ఎస్ జే యు జిల్లా కమిటీ
ములుగు ప్రతినిధి : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యు జే ఐ) ములుగు జిల్లా కమిటీ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దివాకరటి ఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువా తో సత్క రించి టి ఎస్ జే యు రాష్ట్ర కమిటీ నుండి వచ్చిన ములుగు జిల్లా కమిటీ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లా కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకు తోడ్పడా లని, వాస్తవిక వార్తలను వెలికి తీయాలని, జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తా నని ఆయన అన్నారు. అనంతరం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, డిపిఆర్ఓ రఫిక్ లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. డి పి ఆర్ ఓ కు టి ఎస్ జే యు ములుగు జిల్లా కమిటీ నియామక పత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా కమిటి కి శుభా కాంక్షలు తెలిపి అభినందించారు. డిపిఆర్ఓ కార్యాలయం నుంచి విలేకరులకు పూర్తి సమాచారము, సంబంధిత సేవల ను ఎల్లవేళలా అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో టీఎస్ జేయు ములుగు జిల్లా గౌరవాధ్యక్షుడు పడమ టింటి నగేష్, అధ్యక్షుడు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్య దర్శి సంగ. రంజిత్ కుమార్, ఉపాధ్యక్షుడు కూనూరు మహేం దర్, జాయింట్ సెక్రెటరీ తడక హరీష్, కోశాధికారి పొన్నాల స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల రాజు,ఈసీ మెంబర్ కవ్వం పల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.