జాకారంలో పొటా పోటిగా జోనల్ క్రీడలు

Written by telangana jyothi

Published on:

జాకారంలో పొటా పోటిగా జోనల్ క్రీడలు

– గెలుపు కోసం – పిఈడి,పీఈడీలు శిక్షణ మెలుకువలు

– డాక్టర్ రాములు ఆధ్వర్యంలో వైద్య సేవలు

ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల కాళేశ్వరం జోన్ క్రీడా పోటీలు జాకారం గురుకులంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాకారం గురుకులం ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, వివిధ గురుకు లంకు చెందిన క్రీడాకారులు వివిధ రంగాల పోటీల్లో పాల్గొన గా గెలుపు కోసం పి ఈ డి, పీఈటీలు శిక్షణ మెలుకువలు అందించి గెలుపు కోసం కృషి చేశారు.

టెన్నికాయడ్ వివరాలు : అండర్ 14 విన్నర్స్ జాకారం రన్నర్ ఏటూరు నాగారం, అండర్ 17 మంతినిపై జాకారం గెలుపొందింది. అండర్ 19 సిర్పూర్ టౌన్ పై జాకారం గెలుపొందింది. చెస్ వివరాలు: అండర్14 బెల్లంపల్లి, మంతిని గెలుపొం దింది. అండర్ 19 మంథని పై ఏటూరునాగారం గెలుపొందింది. క్యారం వివరాలు : అండర్ 19 మంథని స్కూలు విజేతగా నిలిచింది. కోకో వివరాలు :  అండర్ 14 ఆట నందు జాకారం పై మంథని స్కూలు విజేతగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల డిసీఓలు బిక్షపతి, శ్రీనివాస్, యాదగిరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. క్రీడాకారులకు డాక్టర్ సిహెచ్ రాములు ఆధ్వర్యంలో వైద్య సేవ అందించారు. వైద్య బృందం జాయిసీ రాచెల్, వెంకన్న, తిరుమల, నసీమ, ఆరోగ్య సిబ్బంది, జాకారం పాఠశాల ఉపాధ్యాయుల బృందం సురేష్ బాబు,రామ్రెడ్డి, పిచ్చిరెడ్డి, మమత,వ్యాయామ ఉపాధ్యాయు లు వెంకట్రెడ్డి, భాస్కర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now