మినీ మేడారం జాతర సక్సెస్ కు సహకరించాలి
– ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా
– ఆదివాసీ సంఘాలతో సమావేశం
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : 2025 ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఆసియాలోనే పేరుగాంచిన గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క సారలమ్మల జాతర మేడారం మినీ జాతరను విజయవంతం చేసేందుకు అందర సహకరించాల ని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా పిలుపుని చ్చారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన పీవో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారు. మినీ మేడారం జాతరను పురస్కరించుకొని పిల్ల జాతరలు నిర్వహించే ఆదివాసీ గ్రామాలలో రోడ్లు, కరెంటు, మంచి నీటి సౌకర్యాలు కల్పించాలని, ఆదివాసీ సంస్కృతి ప్రతిబించే ద్వారాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలో 60 ఇలవేల్పులకు గుడి నిర్మాణాలు, గద్దెలు, పూజలకు సంబం దించిన ఖర్చులు అందించాలని కోరారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో చర్చించి ఆదివాసీ గుడాలను, ప్రధానంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేవాదుల నుంచి ములుగు జిల్లా పరిధిలో గల చెరువులలో నీటిని నిల్వ చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఏజెన్సీ చట్టాలు 1/70, ఆర్వో ఎఫ్ఆర్, పెసా చట్టాలను అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో డీడీ పోచం, ఈఈ వీరభద్రం, ఎస్వో రాజ్కుమార్, సురేష్ బాబు, ఎస్డీసీ డీటీ అనిల్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఆదివాసీ సంఘాల ప్రతి నిధులు పొడెం రత్నం, మైపతి అరుణ్ కుమార్, మడి సాయి బాబు, పొడెం బాబు, దబ్బ సుధాకర్, కొత్త సురేందర్, వట్టం సుభద్ర, పాయం అనిత, భాగ్యలక్ష్మి, రవి, సుధాకర్, నాగేశ్వర్ రావు, 100మంది ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.