రెడ్డి గాండ్ల వారిని బీసీలు గా గుర్తించవద్దు

Written by telangana jyothi

Updated on:

రెడ్డి గాండ్ల వారిని బీసీలు గా గుర్తించవద్దు

– తెలంగాణ రాష్ట్ర బీసీ డెడీకేటెడ్ కమీషన్ ఛైర్మెన్ కు బీసీ కులసంఘాల వినతి

కాటారం,తెలంగాణజ్యోతి ప్రతినిధి : రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రెడ్డి గాండ్ల వారిని బీసీలు గా గుర్తించవద్దని కాటారం డివిజన్ లోని బిసి కులసంఘాల నేతలు తెలంగాణ వెనుకబడిన తరగతుల డేడికేటెడ్ కమీషన్ ఛైర్మెన్ బూసాని వెంకటేశ్వర్లకు వినతిపత్రాన్ని అందజేశారు.తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తిం పు పెర్గోనే అంశంలో డేడికేటెడ్ కమీషన్ బహిరంగ విచారణ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో హన్మకొండ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అఖిల గాండ్ల సంక్షేమ సంఘం కాటా రం డివిజన్ అధ్యక్షులు నిడిగొండ మైనర్ బాబు మాట్లా డుతూ రెడ్డి గాండ్ల కులస్తులకు గతంలో జారీ చేసిన తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని బీసీలు గా గుర్తించరాదని, మా ప్రాంతంలో ఉన్న అన్ని బిసి కులాలకు న్యాయం చేయాలని విన్నపిం చారు. ఈ కార్యక్రమంలో బిసీ కుల సంఘాల నాయకులు ఆత్మకూరి స్వామి యాదవ్, సముద్రాల తిరుపతి, విజయగిరి సమ్మయ్య, ముక్కెర వినోద్ గౌడ్, వెన్నంపల్లి మహేష్ తదిత రులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now