జాకారం గురుకులంలో ఘనంగా జోనల్ లెవల్ క్రీడలు

Written by telangana jyothi

Published on:

జాకారం గురుకులంలో ఘనంగా జోనల్ లెవల్ క్రీడలు

– క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి 

– విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలి 

– డి ఐ ఈ ఓ చంద్రకళ 

ములుగు ప్రతినిధి : క్రీడలలో విద్యార్థులు నైపుణ్యాన్ని పెం పొందించుకోవాలని డిఐఈఓ చంద్రకళ తెలిపారు. టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జాకారం లో టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ క్రీడలు ఘనంగా నిర్వహించారు. టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ములుగు జిల్లా డిసిఓ డాక్టర్ ఏ వెంకటేశ్వర్లు అధ్యక్షతన క్రీడలకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా డిఐఈఓ చంద్రకళ హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో రాణించి సొసైటీకి పేరు సంపాదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడరంగంలో ముందు ఉంటే ఏ రంగన్నైనా సాధించగలరని ఆమె తెలిపారు. జాకారంలో క్రీడలపట్ల ఘనంగా ఏర్పాట్లు చేయడాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ములుగు ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని స్నేహభావంతో ముందుకు పోవాలన్నారు. విద్యా ర్థులు క్రమశిక్షణతో ముందుకు పోతే ఉన్నత స్థాయిలో ఉంటా రన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడాకారులు డి సి ఓ లు, పీఈ డీలు, పీఈ టీ లు అందరు కలిసి ఒలంపిక్ టార్చి ని వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.కాగా టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సాంబయ్య పటేల్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచినం దుకు గాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభి షేకం చేశారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్ర మాలు చేపట్టారు. ములుగు బాలికల గురుకులం విద్యార్థి నిలు పాల్గొనీ నృత్యాలు చేయడంతో ఈ కార్యక్రమంలో ప్రత్యే క ఆకర్షణీయంగా నిలిచారు. అతిథులకు మెమోటో ఇచ్చి శాల తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి సి ఓ లు బిక్షప తి, శ్రీనివాసరావు, యాదగిరి అన్ని గురుకులాల ప్రిన్సిపాల్ లు, వైస్ ప్రిన్సిపల్ పిచ్చిరెడ్డి, సీనియర్ అద్యపకులు సురేష్ బాబు, రామ్ రెడ్డి, పి ఈ డి వెంకట్ రెడ్డి, అన్ని గురుకులాల పీఈ డీలు, పీఈటీలు, జాకారం అధ్యాపక బృందం రామ చంద్రం, యాదగిరి, బ్రహ్మచారి, సదయ్య, ఆనంద్, దయా నంద, పుల్లయ్య, మమత, రజిని, క్రీడాకారులు గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now