మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలి
మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలి
– మహాముత్తారం లో సుడిగాలి పర్యటన
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం,తెలంగాణ జ్యోతి ప్రతినిధి: విద్యార్థులకు మెరుగై న విద్య నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహా ముత్తారం మండ లంలోని మోడల్ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశా రు.భోజనం, కూరలను పరిశీలించారు.ఆకుకూర పప్పు, గుడ్డు వడ్డిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నిర్వహించనున్న ఈ కళాశాలలో 302 మంది నుండి 9 వరకు, 97 మంది ఇంట ర్మీడియట్ విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల, ఉపాధ్యాయులు హాజరు రిజిస్టర్లు పరిశీలిం చారు. 272 విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపల్ తెలుపగా గైర్హాజరు చాలా మంది ఉన్నారని ఏదేని ఆరోగ్య సమస్యలు న్నాయా అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లి నుంచి విద్యా ర్థులు వస్తుంటారని బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తరచూ గైర్హాజరు అవుతున్నారని, బస్సు సౌకర్యం కల్పించాలని కోర గా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులు వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదని చాలా రోజు లు నుండి పెండింగులో ఉన్నాయని తెలుపగా డీఈవోతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ అహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.