స్వచ్ఛతా హీ సేవాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: గ్రామాల సచ్చతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. బుధవారం కాటారం మండలం గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత ఆయన పేర్కొన్నారు. గ్రామాలు స్వచ్ఛత సాధించుటకు వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగను న్నాయని ఇట్టి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి రోజు ఒక కార్యక్ర మం ఉంటుందని, అట్టి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వ హించాలని పేర్కొన్నారు. అంతకుముందు కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఛాంబర్, రికార్డు రూము, సిబ్బంది గదులను పరిశీలించారు. కార్యాల యం నిర్వహణ పరిసరాలు బాగున్నాయని అభినందించా రు. ఈ కార్యక్రమాల్లో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.