శీతాకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

శీతాకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

శీతాకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

– విధులు పట్ల నిర్లక్ష్యం వహించితే సహించేది లేదు

– ములుగు డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గోపాలరావు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : శీతాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే డెలివరీ కేసులు, బాలింతలు ఇతర కేసులు విషయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎల్లవేళల విధులు నిర్వహించాలని, ఆశా వర్కర్లు, ఎఎన్ ఎమ్. లు వారికి కేటాయించిన ప్రాంతాల్లో, గ్రామాలు,లో ఇంటింటి సందర్శన ద్వారా వ్యాధులను గుర్తించి, వైద్య సేవలు అందించాలని, ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు ఆదేశించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం అండ్ హెచ్ ఓ సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో రోగులకు అందు తున్న సేవలతో పాటు, ఫార్మసీ రూము, అవుట్ పేషెంట్లు, ల్యాబ్ మరియు ఎక్సరే తదితరాలను తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి మెడికల్ ఆఫీసర్లకు వివిధ వైద్య సేవలపై ఆదేశాలు జారీ చేశారు. తొలిసారి సందర్శించిన సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ,ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు సంయుక్తంగా నూతన డిఎంహెచ్ఓ డాక్టర్ గోపాలరావు ను పట్టు శాలవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్, డాక్టర్ కొమరం మహేందర్, డాక్టర్ మధుకర్,డాక్టర్ యెహిత,హెచ్ఈఓలు కుప్పిలి కోటిరెడ్డి, వెంకట రమణ, ఏఎన్ఎం నాగేంద్ర కుమారి, సత్య నాగవేణి, లలిత కుమారి, నాగజ్యోతి, ఛాయాదేవి, కన్యా కుమారి, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.