ఐటీడీఏలో “రాజీవ్ ఆరోగ్యశ్రీ” పై అవగాహన సదస్సు
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటిడిఏలో పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యో గస్తులకు శనివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐటీడీఏలో పనిచేస్తున్న 48 మంది దినసరి ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని కల్పించాలని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందుతున్న సేవలను ఉన్నతాదికారుల నుండి ప్రాజెక్ట్ ఆఫీసర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ విక్రమ్, టీంలీడర్ సుమన్లు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సంవత్సరానికి 10 లక్షలు సాయం ఒకకుటుంబానికి వర్తిస్తుందని తెలిపారు. గుండె, ఊపిరి తిత్తులు, కాలేయం, ఎముకలు, పక్షవాతం మొదలగు వ్యాధుల కు వర్తిస్తాయని తెలిపారు.అదేవిధంగా 1835 రోగాల కు ఆరోగ్య శ్రీ స్కీమ్లో ఉచితంగా వైద్యం అందించబడుతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు దావఖా నలు 88 ఉన్నాయన్నారు. ఏ వ్యాధి ఏ హాస్పిటల్లో వస్తుందో తెలిపారు. ఎవరికైనా ఏమైనా ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగితే హాస్పిటల్ కి వెళ్లిన మొదట మీరు ఆరోగ్య మిత్ర కౌంటర్ దగ్గరికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియ జేశారు. ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు వెంట తీసుకొని వెళ్లాలని సూచించా రు. ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 104 కు కాల్ చేయవచ్చు అని కూడా తెలియజేశారు. ములుగు జిల్లాలో డయాలసిస్ రోగులు ఉన్నట్లయితే సి ఎస్ సి ఏటూరు నాగారం డయాలసిస్ సెంటర్ ను సంప్రదించవచ్చని తెలియజే శారు. ఈ సమావేశంలో సురేష్ బాబు స్టాటిస్టికల్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూరునాగారం, కొండలరావు జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగారం, మహేందర్ ప్రోగ్రామ్ మేనేజర్, ఆరో గ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్ విక్రమ్, టీంలీడర్ సుమన్, ఆరోగ్యామిత్ర కొండా రమేష్, ఆరోగ్య మిత్రలు సరస్వతి, రాంబాబు, శివ, ఐటిడీలో పనిచేస్తున్న దినసరి ఉద్యోగులు, అధికారులు, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు పాల్గొన్నారు.