కులగణనను అడ్డుకున్న గ్రామస్థులు

Written by telangana jyothi

Published on:

కులగణనను అడ్డుకున్న గ్రామస్థులు

– ఐలాపూర్ నుండి సర్వాయి వరకు తారు రోడ్డు నిర్మించాలి

– రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్,ఎంపిటిసి, బహిష్కరిస్తాం

– మా డిమాండ్లు నెరవేస్తేనే జనగణ సమగ్ర కుటుంబ సర్వేకి సహకరిస్తాం

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం :కన్నాయిగూడెం మండ లంలోని ఐలాపూర్ గ్రామంలో 3వ రోజు కులగణన సర్వేకి వచ్చిన ఎన్యూమరేటర్, ఎపిడి మరియు ఐలాపూర్ స్పెషల్ అధికారులను ఐలాపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ  మా గ్రామం భారత రాజ్యాంగ గేజిట్ లో 5వ షెడ్యూల్డ్ ఉన్న ప్పటికీ ట్రైబల్ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహారించటం బాధాకరమని, ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వ ప్రజా ప్రతి నిధులు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కలిపించకుండా దొడ్డి దారి సర్వేలు నిర్వహించి ఓట్లేసిన ప్రజలను పక్కతోవా పట్టిస్తున్నారని, అంతేకాకుండా మా రోడ్డుని కూడా పక్కదారి పట్టించి కుర్చీలకె పరిమితం అవుతున్నారన్నారు. మా ఓట్లు కావాలి కానీ అభివృద్ధికి మమ్మల్ని దూరంగా ఎందుకు ఉంచుతున్నారన్నారు. మేము కొనే ప్రతి వస్తువు నుంచి సర్వీస్ టాక్సీ, జీఎస్టీ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేరుతలేవా అని ప్రశ్నించారు. మా గ్రామానికి రోడ్డు కావాలని ప్రతి అధికారికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన, మాకు రోడ్డు నిర్మించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో మా గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతదేశ ప్రదాన మంత్రిలు రావాలి, మా గ్రామానికి తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చెసి రోడ్డు పనులను ప్రారంభించే వరకు ఈ తెలంగాణా రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేను జరగనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జెడ్పిటిసి ఎన్నికలను కూడా బహిస్కరిస్తామన్నారు. షెడ్యూలు తెగ ఐలాపూర్ గ్రామస్తులందరూ ముక్తకంఠంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడె సుధాకర్, వెంకటయ్య, మల్లేష్ బాలయ్య, చంద్రయ్య వెంక టేష్, సూర్యం, సమ్మయ్య, కొమరం భీమ్ యూత్ లక్ష్మీ నారా యణ, శివకుమార్, సధానందం, సురేష్ అన్వేష్, లడ్డు, రాజేష్, రవి సావిత్రి, అరుణ, పద్మ, లక్ష్మి, రజిత లతోపాటు  గ్రామస్తులందరు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now