కలిపాక అడవుల్లో భారీగా టేకు కలప పట్టివేత

కలిపాక అడవుల్లో భారీగా టేకు కలప పట్టివేత

– వెంకటాపురం రేంజీ కార్యాలయానికి కలప తరలింపు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని ఆలు బాక సెక్షన్ తిప్పాపురం పంచాయతీ కలిపాక అటవీ ప్రాంతం లో కొంతమంది స్మగ్లర్లు టేకు కలపను తరలించేందుకు సిద్ధం చేసినట్లు నమ్మదగిన సమాచారంతో సోమవారం అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ముందే పసికట్టిన వీరప్పన్ స్మగ్లర్లు జాగ్రత్త పడటంతో టేకు కల పను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలు బాక పారెస్ట సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్ కథనం ప్రకారం.. కలిపాక అడవుల్లో పెంట్రోలింగ్ చేస్తుండగా టేకు కలప ఏడు దుంగ లను కనుగొన్నారు. ఈ దాడుల్లో రెండు సీ.ఎం. టి. టేకు కలపను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,50,000 పిలువ ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. యూ. డి .ఆర్. కేసుగా నమోదుచేసి ఫారెస్ట్ ఉన్నతా ధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆలుబాక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, బీట్ ఆఫీసర్ మౌనిక, డోలి సెక్షన్ బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య, బేస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరిహద్దులోని చతిస్గడ్ అటవీ ప్రాంతం నుండి అటవీ వీరప్పన్ స్మగ్లర్లు నాణ్యమైన టేకు కలపను రవాణా కు సిద్దం చేయగా, అటవీ శాఖ అదికారులు స్మగ్లర్ల యత్నాన్ని భగ్నం చేసారు.