చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షునికి డాక్టరేట్ ప్రధానం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలానికి చెందిన చేయూ త స్వచ్చంధ సేవా సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ కు తాను చేస్తున్న స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు, రక్తదాన శిబిరా లు ఏర్పాటు చేయడం పట్ల జాతీయ స్తాయి గుర్తింపు లభిం చింది. ఈనెల 29న హైదరాబాద్ కోఠీ లోని తెలంగాణ సర స్వతి పరిషత్ ఆడిటోరియంలో ఆసియా వేదిక్ అంతర్జా తీయ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్పూర్తి సొసైటీ ఇండియా ఎన్. జీ.వో ఆధ్వర్యంలో జరిగే సంయుక్త కార్యక్రమాల్లో చేయూత ఫౌండేషన్ కు సోషల్ సర్వీసెస్ డాక్టర్ అవార్డు, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున భారతీయ స్ఫూర్తి సేవా రత్న నేషనల్ అవార్డు, బ్లడ్ డోనర్ మోటివేటర్, సోషల్ యాక్టివిస్ట్ సోషల్ ఆక్టివిస్ట్ అవార్డు లను అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్, చేయూత ఫౌండేషన్ సహాయకుడు బట్టి విజయ్ లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో డాక్టర్ ఆకుల రమేష్ ,వివిధ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, డాక్టరెట్లు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు వెంకటాపురం వాస్తవ్యులు చేయూత సేవా సంస్థ వ్యవస్థా పకులు సాయి ప్రకాష్ డాక్టరేట్ అవార్డు ను అందుకోవడం పట్ల చేయడం పట్ల పలువురు ప్రముఖులు, ప్రజలు శుభాకాం క్షలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సాయి ప్రకాష్ డాక్టరేట్ పొందడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతూ భారీగా త్వరలో సన్మాన కార్యక్రమం చేపట్టనున్నట్లు అభిమానులు తెలిపారు.