దొంగిలించబడిన 9 మొబైల్ ఫోన్లు అప్పగింత
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో దొంగిలించబడిన 9 మొబై ల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించామని ఎస్సై సీహెచ్.వెంకటేశ్వర్ రావు తెలిపారు. గురువారం పోలీస్ స్టేష న్లో బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్సై వివరాలు వెల్లడించారు. పోలీసు శాకలోని ప్రత్యేక పోర్టల్ ద్వారా దొంగలించబడిన సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. సీఐఈఆర్ పోర్టల్ ద్వార పోగొట్టుకున్న బాధితులు ఆన్లైన్ లో నమోదు చేసిన సెల్ వివరాలతో ట్రేస్ చేసినట్లు ఎస్సీ తెలిపారు. ఈ సందర్భంగా రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్సై అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.