పుట్టిన రోజున అనాధాశ్రమంలో అన్నదానం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన తోడే శ్వేత వంశీకృష్ణ దంపతుల కుమారుడు శ్రీతిక్ వేదన్ష్ రెడ్డి రెండవ పుట్టినరోజు సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అమృత వర్షిని అనాధాశ్రమంలో వృద్ధులకు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆతిథ్య స్వీకరించిన ఆశ్రమంలోని వృద్ధులు శ్రీతిక్ వేదన్ష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి మనసారా దీవించారు. ఈ సందర్భంగా శ్వేతా రెడ్డి మాట్లాడుతూ పుట్టిన రోజు వేడుకలు ఆడంబరంగా నిర్వహించుకోకుండా పేదలకు సహా యం చేస్తే అందులో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదన్నారు. కుమారుడు పుట్టినరోజున వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం తమకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అమృత వర్షిని నిర్వాహకులు శ్యామ్, బండం తిరుపతిరెడ్డి, గోనె అజయ్ రెడ్డి, బాసాని శ్రీ ప్రియ, సూరం వర్ణిత తదితరులు పాల్గొన్నారు.