దొంగిలించబడిన 9 మొబైల్​ ఫోన్లు అప్పగింత

దొంగిలించబడిన 9 మొబైల్​ ఫోన్లు అప్పగింత

దొంగిలించబడిన 9 మొబైల్​ ఫోన్లు అప్పగింత

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు పోలీస్​ స్టేషన్​ పరిధిలో వివిధ సందర్భాల్లో దొంగిలించబడిన 9 మొబై ల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించామని ఎస్సై సీహెచ్​.వెంకటేశ్వర్​ రావు తెలిపారు. గురువారం పోలీస్​ స్టేష న్​లో బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్సై వివరాలు వెల్లడించారు. పోలీసు శాకలోని ప్రత్యేక పోర్టల్ ద్వారా దొంగలించబడిన సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. సీఐఈఆర్​ పోర్టల్ ద్వార పోగొట్టుకున్న బాధితులు ఆన్​లైన్​ లో నమోదు చేసిన సెల్ వివరాలతో ట్రేస్​ చేసినట్లు ఎస్సీ తెలిపారు. ఈ సందర్భంగా రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్సై అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.