చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి 

చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి 

చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి 

– బి ఆర్ ఎస్ నేత జక్కు శ్రావణ్ 

    కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయాలని, అదేవిధంగా భూనిర్వాసితులను ఆదుకోవాలని కాటారం మండల బీఆర్ఎస్ నేత జక్కు శ్రావణ్ కుమార్ కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంథని శాసనసభ నియోజకవర్గంలో గల చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను మంత్రి శ్రీధర్ బాబు చొరవ తీసుకొని, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చే శంకుస్థాపన చేపట్టి, అప్పటి క్యాబినెట్లో మంత్రిగా, అప్పటినుంచి ప్రస్తుతం రాష్ట్రంలో అధికా రంలో మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్న నేపథ్యంలో చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆదుకోవడంతోపాటు రైతాంగానికి సకాలంలో ఫలాలు అందే విధంగా చూడాలని ఆయన కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment