ఎరువులు, పురుగు మందు దుకాణాల తనిఖీలు

Written by telangana jyothi

Published on:

ఎరువులు, పురుగు మందు దుకాణాల తనిఖీలు

– రైతులకు ప్రభుత్వ ధరకే యూరియా విక్రయాలు. 

– జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్ర.  

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్ర, మండల వ్యవసాయ సంచాలకులు శ్రీధర్, ఏటూరు నాగారం వ్యవసా య శాఖ సహాయ సంచాలకులు శ్రీధర్ ల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులకు ఎటు వంటి కొరత లేకుండా యూరియాను రవాణా ఖర్చులు లేకుండా ప్రభుత్వ ధర బస్తా రూ. 266.50 రూపాయలకు రైతులకు విక్రయించేందుకు వెంకటాపురం శివాలయం వీధి లోని ఆగ్రోస్ షాఫ్ సంస్థ యజమాని వద్ది శ్రీనాథ్ పటేల్ కు  అనుమతులు మంజూరు చేశారు. ప్రతి రైతు ఎరువులు కొనుగోలు చేసే ముందు తమ ఆధార్ కార్డుతో ఎరువులను కొనుగోలు చేయాలని, అలాగే ప్రతి డీలర్ రైతులకు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగుమందులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల నిల్వలు, పురుగు మందులు వాటి ధరలు ఆయా డీలర్లు విధిగా షాపుల ముందు ఏరోజు కారోజు ధరల పట్టిక ప్రదర్శించాలని స్టాకు వివరాలు బోర్డుపై రాయాలని ఆదేశించారు. గతంలో రవాణా ఖర్చులు కలుపుకొని కొంతమంది డీలర్లు బస్తా యూరియా 300 రూపాయలు విక్రయిస్తున్నట్లు సమాచారంతో, వ్యవసా యశాఖ రంగంలోకి దిగి ప్రభుత్వ ధరకు వికయించాలని ఫర్టిలైజర్ యజమానులకు సూచిస్తూ, రైతులు ప్రభుత్వ దరకే కొనుగోలు చేయాలని తెలిపారు.

Leave a comment