వైభవంగా అయ్యప్ప స్వామి పంబ ఆరట్టు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో అయ్యప్పస్వాములు పంబఆరట్టు (శోభయాత్ర)ను ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆనంద ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనం తరం ఉత్సవ మూర్తిని ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేపట్టారు. మహిళలు మంగళ హారతులతో స్వామి వారిని స్వాతం పలుకుతూ దర్శించుకున్నారు. మాలధారణ స్వాముల శరణఘోష, నృత్యాల తో స్వామివారి ఆరట్టు మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. పురవీధుల్లో ఊరేగిం పు అనంతరం పవిత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం త్రివేణి సంఘంలో జలాభిషేకంతో పాటు చక్ర స్నానాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. శోభాయమానంగా జరిగిన స్వామివారి ఊరేగింపు లో వేద పండీతులు భాను ప్రసాద్ శర్మ, జీవిశాస్త్రి, ఆలయ వ్యవస్థాపకు లు బచ్చు అశోక్, ఆలయ కమిటీ అధ్యక్షులు బచ్చు ప్రకాష్, కమిటీ ప్రతినిధులు పిచరా రామకృష్ణారావు, పెండ్యాల రంజిత్ కుమార్, చీమల రాజు, జక్కు మొగిలి.. గురుస్వాములు అయిత వెంకన్న, మద్ది నవీన్, పసుల రామచంద్రం, గంగిరెడ్డి లక్ష్మారెడ్డి, ముస్కామల్ల సత్యం తదితరులు దీక్షపరులు పాల్గోన్నారు..