మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ చేయూత

మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ చేయూత

మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ చేయూత

– ఆర్థిక సహాయం అందజేసి భుజం తట్టి ధైర్యం చెప్పిన బి.ఆర్ఎస్ నేత గంప రాంబాబు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక, బోధాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాలలో వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు మండల బిఆర్ఎస్ పార్టీ  ఆర్దిక సహా యం అందజేసి భుజం తట్టి ధైర్యం చెప్పి, అండదండగా ఉంటా మని మానవత్వం చాటారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆలు బాక పంచాయతీ పరిధిలోని బాడిస ప్రసాద్, భోదాపురం పంచాయతీ చెందిన గట్టుపల్లి నూక రాజులు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జి.పి లోనీ తానిపర్తి గ్రామానికి చెందిన దుర్గం సామ రాజు పాముకాటుతో చనిపోయారు. కూలినాలి చేసుకొని జీవనం సాగించే, పేద కుటుంబాల ఇంటి యజమానులు చనిపోవడంతో, ఆయా కుటుంబాలు తీవ్ర మనో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, పార్టీ కార్యకర్తలు, నాయ కులు గురువారం ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని, పార్టీ పరంగా ఆయా కుటుంబాలకు 25 వేల రూ. ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాక మృతుల కుటుం బాలకు ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు తోపాటు, ఇళ్ళ కాలనీలు మంజూరుకు పార్టీ పరంగా సహాయ సహకారాలు ఇస్తామని, ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పిం చారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నేత ఎస్కే. ముస్తాఫా, మాజీ సర్పంచ్ ఆదిలక్ష్మి, నాయకులు సుంకర సంటి, బి. సమ్మయ్య, పి. రాజు, తెల్లం ఆనంద్ కుమార్, కన్నారావు, శ్యామల రమేష్, తాటి నాగేంద్ర మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామస్తులు మృతుల బంధువులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్. పార్టీపరంగా ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటిన బిఆర్ఎస్ పార్టీ నాయ కులకు, పార్టీలకు అతీతంగా పంచాయతీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment