పొగాకు ఉత్పత్తుల మహమ్మారికి దూరంగా ఉండండి

పొగాకు ఉత్పత్తుల మహమ్మారికి దూరంగా ఉండండి

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో శుక్రవారం పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రపంచ దేశాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవమును ప్రతి సంవత్సరం మే 31 రోజున నిర్వహించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా శుక్రవారం ఏజెన్సీలోని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థీమును ప్రజల్లోకి అవగాహన కొరకు పంపించడం జరుగుతుందని,ఈ సంవత్సరం థీమ్”పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం” అని తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఏ రకమైన పొగాకు ఉత్పత్తులను ఎప్పుడూ ఉపయోగించనని, లేదా తిననని ప్రతిజ్ఞ చేస్తున్నాను.నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తు లందరినీ పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకూడదని నేను అవ గాహన కల్పిస్తానని, పొగాకు ఉత్పత్తుల వాడకం నుండి నా పర్యావరణ రక్షణకు కూడా నేను సహకరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ధూమపానం చేయటం వలన పొగ తాగే వారికి కాకుండా చుట్టుపక్కల పరిసరాలు వారికి కూడా ఆరోగ్యానికి హానిచేయునని, పొగాకు ఉత్పత్తుల మహమ్మారి కి దూరంగా ఉండాలని తెలియజేశారు.పొగాకులో ఉండే నికోటిన్ పదార్థం మెదడుపై పనిచేసి మత్తు బానిసలుగా గురి అవుతున్నారని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఈ అవగాహన ర్యాలీలో రోహీర్ పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ ఏ.సుమలత, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేషన్ స్వరూప రాణి, సూపర్వైజర్ కమల తదితరులు పాల్గొన్నారు.