కొండగట్టుకు బయలుదేరిన హనుమాన్ స్వాములు

Written by telangana jyothi

Published on:

కొండగట్టుకు బయలుదేరిన హనుమాన్ స్వాములు

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని హనుమాన్ స్వాములు 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు దీక్ష పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఉదయం రామాలయంలో ఇరుముడి కట్టుకొని కొండగట్టుకు హనుమాన్ స్వాములు బయలుదేరారు. రామాలయం నుండి స్వాములు ఇరుముడి ఎత్తుకొని, గురు స్వాములు, కన్నె స్వాములు, మాలదారన స్వాములందరూ,అంగరంగ వైభవంగా, భజన పాటలతో, శ్రీరామ, హనుమస్మరణతో, జైశ్రీరామ్, జై హనుమాన్ అంటూ భక్తి పరవశంలో హనుమాన్ పాటలు పాడుతూ, వాహనాలకు పూజ చేసి, గ్రామ దేవతలకు, కులదేవతలకు, కుటుంబ సభ్యుల సమేతంగా కొబ్బరికాయలు కొట్టి, శ్రీ హనుమాన్ అంటూ భజన పాటలతో హనుమాన్ స్వాములందరూ మాల విరమణకు, వేములవాడ, కొండగట్టుకు, భద్రాచలంకు, గీసుకొండ, మలక్ పేట లకు బయల్దేరారు.

Leave a comment