విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి

విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి

విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి

– జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే 

కాటారం, తెలంగాణ జ్యోతి : ఉద్యోగులు పదవి విరమణ అనంతరం విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. టేకుమట్ల పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ, మంగళ వారం పదవి విరమణ పొందిన ఏఎస్‌ఐ పింగళి అమరేందర్ రెడ్డి ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరే పూలమాలవేసి, శాలువాతో సత్కరించి, గృహపకరణాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్‌ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, కిరణ్, శ్రీకాంత్, అమరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment