కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మంత్రి సీతక్కకు వినతి 

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మంత్రి సీతక్కకు వినతి 

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మంత్రి సీతక్కకు వినతి 

ములుగు జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గిరిజన శాఖలోని కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని ఆదివాసి,లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, అజ్మీరా పూల్ సింగ్ నాయక్ లు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ధనసరి సీతక్క కు వినతి పత్రాన్ని అందజేశారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న వారిని గత పాలకులు మోసం చేశారని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెయ్యి 8 వందల 4 కాంట్రాక్టు ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ గురుకులలో 4 వందల 91 మంది బోధనేతర ఉద్యోగులు,గిరిజన సహకార సంస్థలలో 94 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని ఉద్యో గ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారని మంత్రికి వివరిం చారు.తెలంగాణ ఉద్యమ కాలంలో పది సంవత్సరాలు, కెసి ఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కాలయాపన చేసి మో సం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముఖ్య సలహాదారుడు పొదు గు శ్రీనాథ్, ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్య క్షులు బచ్చల ఎర్రయ్య, కాంట్రాక్టు ఉపాధ్యాయులు అజ్మీరా మంజునాయక్, బి.రాజు నాయక్, బి.బాలాజీ దాస్ తదిత రులు పాల్గొన్నారు.