కొండెక్కిన కూరగాయల ధరలు..!
కొండెక్కిన కూరగాయల ధరలు..!
వెంకటాపురంనూగూరు,తెలంగాణజ్యోతి:వర్షాలు ఆగాయి .. వరదలు తగ్గాయి… సామాన్యుడికి కష్టాలు పెరిగి వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట లు నష్టపోవడంతో.. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువ య్యాయి. ఈసీజన్‌లో అందరికి అందుబాటులో ఉండే కూ రగాయాలు, ఆకుకూరల ధరలు భారీ వర్షాల కారణంగా పెరిగి పోయాయి. ముందు ముందు.. మరింత పెరిగే అవకా శాలు ఉన్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు తో పంట నష్టం జరిగింది. దీంతో కూరగాయల సాగు దెబ్బ తీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలాచోట్ల కూరగాయల తోటలు వరదలలో మునిగి పోయాయి. మరి కొన్ని చోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం వరకు పెరిగాయి. దీంతో ములుగు జిల్లా వెంకటాపురం వాజెడ మండలాల్లో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు ధరలు భారీ వర్షాలు, వరదలు కారణంగా రేట్లు బగ్గు మంటున్నాయి.