కొత్తూరు గుట్టకు మెట్ల దారి..!
– అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం
ములుగు ప్రతినిధి : ములుగు మండలం కొత్తూరు గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మెట్ల మార్గం నిర్మాణం చేపడుతున్నారు. మరో అంగ్ కోర్ వాట్ గా పేరుపొందిన జిల్లాలోని కొత్తూరు గుట్టపై ఉన్న ఆలయం వరకు అటవీ శాఖ అధికారులు మెట్ల దారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రాష్ర్ట మంత్రి సీతక్కకు దేవస్థానం కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు అధికారులకు రోడ్డు మార్గం నిర్మించాలని ఆదేశించారు. దీంతో అటవీ అధికారుల ఆదేశాలతో సుమారు కిలోమీటరున్నర మేర మెట్లు గుట్టపైకి భక్తులు వెళ్లేందుకు నిర్మిస్తున్నారు. ఇప్పటికే గత ఐదు రోజుల నుంచి గుత్తేదారు బండరాళ్లతో నిర్మాణం మొదలు పెట్టారు. సుమారు వందమీటర్లు పూర్తయింది. కిలోమీటరున్నర రోడ్డు మార్గాన్ని పూర్తి చేసిన అనంతరం ఆ దారిపై సీసీ వేయడంతోపాటు కూలకుండా రివిటింగ్ చేస్తారు. అదేవిధం గా వృద్ధులు, వికలాంగులు సులువగా నడిచేందుకు పోల్స్ కూడా పాతనున్నారు. అటవీ శాఖ బీట్ అధికారి రవికుమార్ సారథ్యంలో జరుగుతున్న ఈ పనులు ఫిబ్రవరి, మార్చిలోపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు గుత్తేదారు వెల్లడించారు. రోజుకు 20మంది కూలీలతో ఈ నిర్మాణ పనులు చేపడుతు న్నామన్నారు. పూర్తిస్థాయిలో మెట్లమార్గం అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి లక్ష్మీనరసింహస్వామి ఆల యానికి ధూపదీప నైవేద్యాలు నిత్యం జరిగే అవకాశం ఉన్న ట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కిషన్ రావు వెల్లడించారు.