ఉపాధ్యాయులపై దాడిని ముక్త కంఠంతో ఖండన
ఉపాధ్యాయులపై దాడిని ముక్త కంఠంతో ఖండన
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా జడ్పీ హెచ్ఎస్ తుక్కుగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్య సమితిగా ఏర్పడి దాడి దోషులను శిక్షించాలని డిమాండ్ తో చేపట్టారు. నిరసన కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని డి టి ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రమణారెడ్డి ఏ తిరుపతిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పుతూ సమాజానికి విలువలు అందించే విద్యావ్యవస్థలో భాగమైన విద్యా సంస్థలలో ఇలాంటి దాడులు జరగడం శోచనీయం అని పేర్కొ న్నారు. ఇలాంటి దాడులు ఏ రూపంలోనైనా ఎక్కడనైనా జరిగి నట్లయితే ప్రభుత్వాలు వెంటనే స్పందించి దోషులను శిక్షించాలని లేనట్లయితే సమాజంలో విలువల ధ్వంసం జరిగి వేగవం తంగా సమాజాన్ని అంధకారంలోకి తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దాడి దోషులను అరెస్టు చేసి శిక్షించాలని మరొక్క మారు పేర్కొంటూ, లేనట్లయితే ఈ పోరాట కార్యక్ర మాలు ఇంకా ఉదృతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.