అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం 

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం 

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం 

– యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్ వెల్లడి 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని మంథని శాసనసభ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా చేపడు తోందని వివరించారు. గత పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డులు గత ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అంద జేస్తున్న రేషన్ కార్డుల ప్రక్రియలో కొంతమేరకు జాప్యం జరుగుతున్నప్పటికీ, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గదర్శకాల మేరకు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేసే బాధ్యత ను ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త భుజస్కందాలపై వేసుకొని పేద బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చేందుకు కంకణ బద్దులైమై ఉన్నామని స్పష్టం చేశారు. కొంతమంది ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కొంతమేరకు ఆలస్యం జరిగినప్పటికీ, అర్హులైన వారి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి అందరికీ సమ న్యాయం చేస్తామని ఆయన వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్ర చారాన్ని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు ఆపద్బాంధవులుగా, అండదండగా ఉంటామని మరొక్కసారి విస్పష్టంగా వెల్లడిస్తు న్నట్టు ఆయన పేర్కొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment