మందుబాబులకు అడ్డాగా ఎంపీడీఓ కార్యాలయం..?
మందుబాబులకు అడ్డాగా ఎంపీడీఓ కార్యాలయం..?
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలంలో ఎంపీడీవో కార్యాలయం మందు బాబులకు అడ్డగా మారింది. అధికారులు వీధులు నిర్వ హించే కార్యాలయం పైన రాత్రి వేళలో అసాంఘిక కార్యక్ర మాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గత రోజుల నుండి రాత్రి వేళలో కొంతమంది మద్యం సేవించి ఇష్టానుసారంగా భవనం పైనే సీసాలు వదిలేశారు. మద్యం సేవిస్తూ సిగరెట్లు తాగుతూ ఇష్టం ఇస్తానుసారంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు తెలిపారు. మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.