మహాగోర్​ మేళా వాల్​ పోస్టర్​ ఆవిష్కరణ

మహాగోర్​ మేళా వాల్​ పోస్టర్​ ఆవిష్కరణ

మహాగోర్​ మేళా వాల్​ పోస్టర్​ ఆవిష్కరణ

ములుగు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పరిధి లోని తాండో గుడి లో ఈనెల 24, 25న నిర్వహించనున్న మహా గోర్​ మేళా (గోర్​ మళావో) కార్యక్రమ వాల్ పోస్టర్​ ను గురువారం ములుగులోని పోరిక మోహన్​ లాల్​ కార్యాల యంలో ఆవిష్కరించారు. ఈ మేళాను విజయవతం చేయా లని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోర్ శిక్వాడి ఉమ్మడి జిల్లా వచారి బోడ కిషన్ నాయక్, గోర్ శిక్వాడి గోర్ సేన ములుగు జిల్లా అధ్యక్షుడు పోరిక రాజ్ కుమార్ నాయక్, సేవాలాల్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పోరిక సునీల్ నాయక్, ములుగు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పాల్తియా సారయ్య నాయక్, పోరిక శ్యామల్​ నాయక్, నాయకులు ధరావత్ సారయ్య, మూడ్ రవీందర్, నునావత్ రవివర్మ, భూక్యా వెంకన్న , సేవలాల్ సేనా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్, కార్యదర్శి అజ్మీరా రతన్, భూక్యా శరత్, యాదగిరి, కెలోత్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.