ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. చర్చలు సఫలం..!

On: April 24, 2026 6:24 PM

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. చర్చలు సఫలం..!

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. చర్చలు సఫలం..!

కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం

హైదరాబాద్, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో జేఏసీ నేతలు జరిపిన సుదీర్ఘ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. కార్మికుల ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి మంత్రుల బృందం సానుకూలంగా స్పందించడంతో ఆందోళనలు విరమించేందుకు వారు అంగీకరించారు. ఈ పరిణామంతో ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రయాణికులకు కూడా ఊరట లభించింది. ఈ చర్చలపై మరికాసేపట్లో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!