ఈజీఎస్ సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం

ఈజీఎస్ సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం

ఈజీఎస్ సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ, ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహిం చనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్ర ప్రసాద్ ఒక అధికారిక ప్రకటన తెలిపారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, ప్రగతి నివేదికలు, పనుల్లో పాల్గొన్న కార్మి కుల సమస్యలు, చెల్లింపులు, ఇతర అంశాలపై సామాజిక తనిఖీ ప్రజా వేదికలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో పాల్గొని ప్రజావేదిక కార్యక్రమాన్ని జయప్రదం చేయా లని ఎంపీడీవో ఆ ప్రకటనలో కోరారు.