గ్రామాల్లో దుర్గామాత దేవి నవరాత్రుల సందడి
గ్రామాల్లో దుర్గామాత దేవి నవరాత్రుల సందడి
– మండపాలను సిద్ధం చేసిన ఉత్సవ కమిటీలు.
– గురువారం దుర్గామాత విగ్రహాల ప్రతిష్ట.
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : దసరా పండు గ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండ లాలలో దుర్గా దేవి మాత శరన్నవరాత్రులు నిర్వహించేందుకు ఆయా ఉత్సవ కమిటీలు గ్రామాల్లో మందిరాలను ఆహ్లాద కరంగా, భక్తి రసం ఉట్టిపడే విధంగా సిద్ధం చేశారు.. ఇప్పటికే దూర ప్రాంతా.ల నుండి శ్రీ కనక దుర్గామాత విగ్రహాలను కొను గోలు చేసి ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో నిద్రపుచ్చారు. గురువారం ఉదయం సన్నాయి మేళాలు, కోలాటాలు మధ్య ,శ్రీ దుర్గా దేవి మాతను ఆయా నవరాత్రుల మందిరాల వద్దకు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టిం చేందుకు మేళతాలాల బృందాలను ముందుగానే మాట్లాడు కున్నారు. తొమ్మిది రోజులు పాటు జరిగే దేవీ నవరాత్రుల మహోత్సవాలను, భక్తుల సహకారంతో నిర్వహించేందుకు కమిటీలు సన్నద్దమయ్యాయి. వెంకటాపురం మండల కేంద్రం లో ఉత్సవ కమిటీలు పలు వీధులలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుండగా, వేపచెట్టు సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం సమీ పంలో వెంకటాపురం మండల ఆర్యవైశ్య సంఘం ప్రత్యేకంగా నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అనేక గ్రామాల్లో దేవీ నవరాత్రుల మహోత్సవాల స్వాగత సన్నాహాల భక్తి రస సందడి నెలకొనున్నది. పిఠాపురం మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతి రోజు నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు.