గ్రామ గ్రామాన గాంధీ జయంతి వేడుకలు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి :మహాత్మ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండ లాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాలు రాజకీయ పార్టీలు వేరు వేరుగా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత బాపూజీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి పేట, లక్ష్మీపురం, నరసింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయా లలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ఉపాధి కూలీలు ,గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామసభలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి పనులను గుర్తించుకోవాలి గుర్తిం చిన పనులకు ఉపాధి కూలీలకు అందుబాటులో ఉండేలా ఉండాలని గ్రామ పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, రజిత, అనిత, ఫీల్డ్ అసి స్టెంట్లు కేతిరి రాధిక, భాస్కర్, కారో బార్లు లక్ష్మణ్, వాగ్య,కార్తీక్ ఆయా గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు,ఆశ వర్కర్లు, గ్రామం లోని ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.