విద్యార్థులకు స్వయం కృషి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ
విద్యార్థులకు స్వయం కృషి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి : స్వయంకృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక దేవరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరి యల్ మరియు పరీక్ష ప్యాడ్లు లను గద్దె సమ్మిరెడ్డి సహకార ముతో అందచేశారు. ఈ కార్యక్రమములో వక్తలు నవీన్ రావు ,గద్దె సమ్మిరెడ్డి, వంశవర్ధన్ రావు మాట్లాడుతూ విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని, దేశాభివృద్ధిలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని, విద్యార్థులు అన్ని అవకాశాలను వినియోగిం చుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నారు. కార్యక్ర మంలో స్వయంకృషి ఫౌండేషన్ కొట్టే సతీష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 10వ తరగతి వార్షిక పరీక్షల సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు స్టడీ మెటీరి యల్ ఇస్తున్నామని,వాటిని సరిగా వినియోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థులకు స్టడీ మెటీరి యల్ అందజేయటంలో కృషిచేసిన స్వయంకృషి ఫౌండర్ కొట్టే సతీష్, వారి బృందాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అడగగానే సహకారం అందివ్వటానికి ముందుకు వచ్చిన గద్దె సమ్మిరెడ్డి కి స్వయంకృషి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో సన్మానం చేయటం జరిగింది ఈ కార్యక్రమములో గ్రామస్తులు గుడిపాటి రమేష్ రెడ్డి , కామిడి వెంకట్ రెడ్డి, కామిడి శ్రీను , అనంతుల శ్రీను , మిర్యాల శ్రీను , దావా రాజిరెడ్డి , కాల్వ పెల్లి బుచ్చయ్య , దోమ భాస్కర్ , గద్దె దేవేందర్ , పాఠశాల స్టాఫ్ , స్వయంకృషి సభ్యులు సుమన్ , అఖిల్ ,సాయి ,రవి వేణు పాల్గొన్నారు.