పది ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ

పది ఫలితాల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ

– వందశాతం ఫలితాలతో ఉత్తీర్ణత

ములుగు, తెలంగాణ జ్యోతి : రాష్ర్ట విద్యాశాఖ మంగళ వారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఎ.కోటిరెడ్డి, ప్రిన్సిపల్ ఎండీ.హఫీజ్ తెలిపారు. విడుదలైన ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులలో కంది కొండ నిహారిక 9.8/10 సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచిందని, అదే విధంగా అల్లం హాసిని 9.7/10, బోనాల వైష్ణవి 9.7/10, మొహమ్మద్ ఇశ్రత్ 9.5/10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నా రు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతోపాటు వారి తల్లి దండ్రులకు యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.