పదవ తరగతి ఫలితాల్లో గ్రీన్ వుడ్ పాఠశాల ప్రభంజనం
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : పదవ తరగతి పరీక్షల ఫలితాలలో మండలం కేంద్రంలోని గ్రీన్ వుడ్ కాన్సెప్ట్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. పాఠశాలకు చెందిన ఎ. మోక్షిత మరియు సిహెచ్. మణికుమార్ అనే విద్యార్థులు 9.8 జిపిఏ సాధించగా ఐదుగురు విద్యార్థులు 9.7 జిపిఏ సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజకుమారులు అభినందనలు తెలియజేశారు.