అయ్యప్పలతో కలసి ప్రసాదం స్వీకరించిన భద్రాచలం ఎమ్మెల్యే
అయ్యప్పలతో కలసి ప్రసాదం స్వీకరించిన భద్రాచలం ఎమ్మెల్యే
– షెడ్ నిర్మాణానికి 50 వేల రూపాయలు విరాళం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భద్రాచలం నియోజకవర్గంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకటరావు గురువారం సంద ర్శించి అయ్యప్పస్వామి మాల ధారణ భక్తులతో శ్రీ అయ్య ప్పలతో కలిసి ప్రసాదం స్వీకరించారు. మాల ధారణ అయ్య ప్పలు స్వామివారి నామ స్మరణలతో శాసనసభ్యులకు ఆహ్వా నం పలికారు. అదనపు షెడ్ నిర్మాణానికి తమ వంతు సహాయం గా శ్రీ అయ్యప్ప స్వామికి చేయాలని భక్త బృందం, గ్రామ పెద్దలు ఏం.ఎల్.ఎ కు విన్నవించారు. వెంటనే స్పందిం చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం తమ వంతు సహాయంగా శ్రీ అయ్యప్ప మాలధారణ స్వాములకు సౌకర్యం కల్పించేందు కు 50 వేల రూపాయల విరాళం ప్రకటించారు. గురుస్వాము ల ఆశీర్వాదాన్ని ఎంఎల్ఎ పొందారు. అయ్యప్ప స్వామివారి ఆలయం అభివృద్ధికి తమ వంతు సహాయంగా, ఎల్లప్పుడూ అండ దండగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో మాలధారణ అయ్యప్పలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యప్ప భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.