క్రికెట్ క్రీడలలో బ్యాటింగ్ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే

క్రికెట్ క్రీడలలో బ్యాటింగ్ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే

క్రికెట్ క్రీడలలో బ్యాటింగ్ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో వెంకటాపురం ప్రీమియర్ లీగ్ 2024 (వి.పి.ఎల్) క్రికెట్ పోటీలలో అయిదవ రోజు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు పాల్గొని బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సంద ర్భంగా క్రీడామైదానంలో క్రీడాకారులను పరిచయం చేసుకుం టూ క్రీడలు స్నేహ సంబంధాలు పెంపొందిస్తాయని క్రీడలలో ప్రతిభను కనబరిచి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు తీసుకురావాలని  అభిలాషించారు. వెంకటా పురం, వాజేడు, మంగపేట, ఏటూరు నాగారం తదితర నాలుగు మండలాలకు చెందిన క్రికెట్ టీంలు వెంకటాపురం లో నిర్వహిస్తున్న విపిఎల్ ప్రీమియర్ లీగ్ 2024 పోటీలో పాల్గొన్నారు. ఆఖరిరోజు బహుమతి ప్రధానం రోజు తాను హాజరవుతానని, క్రీడాకారులంతా తమ ప్రతిభను చాటుకొని విజయ దుందుభి మోగించాలని ఆశీర్వదించారు. ఈ కార్య క్రమంలో వి.పి.ఎల్. టీం నిర్వాహకులు, క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.